వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చంటి పిల్లల్లా చూడాల్సిన తరుణంలో వారిని దూరం పెడుతున్నారు కొందరు. కనీస బాధ్యతలు విస్మరించి వేళకు తిండి, మంచినీళ్లు ఇచ్చేందుకూ అయిష్టత చూపుతున్నారు. ఆసరాగా ఉండే బదులు ఛీదరించుకుంటున్నారు. మంచాన ఉంటే సపర్యలు చేయడం అటుంచి... వైద్య చికిత్సల పేరిట నడిరోడ్డుపై వదిలివేసి వెళ్లిపోతున్నారు.
తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని రంగంపల్లికి చెందిన వృద్ధురాలు సత్తెమ్మను... చిన్నకుమారుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వదిలేశాడు. వైద్య చికిత్సల పేరుతో హైదరాబాద్ తీసుకొచ్చి అర్ధంతరంగా వదిలేయగా అమ్మ మనసు ముక్కలైంది. ఎటు వెళ్లాలో తెలియక నగర వీధుల్లో అయోమయంగా తిరుగుతున్న సత్తెమ్మను... స్థానికులు పోలీసుల చెంతకు చేర్చారు. రెండురోజులుగా ఆహారం లేక బాగా నీరసించిన వృద్ధురాలిని పోలీసులు వృద్ధాశ్రమంలో చేర్చారు.
ఇవీ చూడండి: రైల్వే కాంట్రాక్టర్ ఆత్మహత్యలో వెలుగు చూసిన మరో కొత్తకోణం