ETV Bharat / state

'మే నెలలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ ప్రారంభం'

nh65
nh65
author img

By

Published : Mar 29, 2022, 12:07 PM IST

Updated : Mar 29, 2022, 3:14 PM IST

12:05 March 29

కేంద్రమంత్రి గడ్కరీతో విజయవాడ, భువనగిరి ఎంపీల భేటీ

భేటీ అనంతరం కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ.. మే మొదటి వారంలోనే ప్రారంభమవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రహదారిని ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చే అంశంపై.. విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి కోమటిరెడ్డి ఇవాళ.. దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. భేటీకి జీఎంఆర్​ ప్రతినిధులను కేంద్రమంత్రి పిలిచారు. రహదారి విస్తరణలో గుత్తేదారుల సమస్య, డిజైనింగ్‌లో సాంకేతిక లోపాలపై ఎంపీలు కేంద్రమంత్రికి వివరించారు.

సుమారు గంట పాటు జరిగిన ఈ చర్చలో హైదరాబాద్-విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే నెలలోనే పనులు ప్రారంభించాలని జీఎంఆర్​ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు పలు అంశాలను ఎంపీ కోమటిరెడ్డి చర్చించారు. నెలలోగా సమస్యలన్నీ పరిష్కరించి.. మేలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని.. కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీలతో పాటు కేంద్ర రవాణా, రహదారుల సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్, ట్రాన్స్​పోర్ట్ సెక్రెటరీ, ఎన్​హెచ్​ఐ అధికారులు పాల్గొన్నారు.

హైవేలో ఉండాల్సిన డిజైన్​ లేదు.. దాని వల్ల రాంగ్​రూట్​లో వచ్చి.. చనిపోతున్నారు. ఇవన్నీ కేంద్రమంత్రితో చర్చించాం. దీనిపై కేంద్రమంత్రి గడ్కరీ స్పందించారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ మే మొదటి వారంలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. సమస్యను పరిష్కరిస్తున్నందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు..

- కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ

సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు...

1.హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లు, ఎక్స్​ప్రెస్ హైవేగా విస్తరించడం

2. ఎన్​హెచ్​ 30 ఇబ్రహీంపట్నం- అమరావతి కనెక్టివిటీ

3. విజయవాడ- నాగపూర్ కొత్త ఎక్స్​ప్రెస్​ హైవే

4. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డులను వెడల్పు చేయడం

5. మహానాడు రోడ్డు, రామవరపాడు, ఎనికేపాడు టీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్​ల నిర్మాణం

6. విస్సన్నపేట గ్రామానికి బైపాస్ నిర్మించడం

7. విజయవాడ నగరానికి కొత్త తూర్పు బైపాస్ నిర్మించడం

8. గొల్లపూడి బైపాస్ నిర్మాణం పనులు వేగవంతం చేయడం

ఇదీ చదవండి: Preparation Strategy for TSPSC: విశ్లేషించి చదివితే.. విజయం నీదే.!

Last Updated : Mar 29, 2022, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.