ETV Bharat / state

తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది: విజయశాంతి - congress

తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ విఫలమైందని కాంగ్రెస్​ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. తాజా పరిణామాలే దీనికి నిదర్శనమని ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారుల మేల్గొని పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దాలని హితవు పలికారు.

vijayashanthi comments on telangana government
తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది: విజయశాంతి
author img

By

Published : Aug 18, 2020, 5:39 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతి ఆరోపించారు. తాజాగా ముంచెత్తుతున్న వరదలే ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. చినుకు పడితే చాలు జలమయమయ్యే హైదరాబాద్​ నగరాన్ని ఎలాగూ కాపాడలేకపోతోందని, ఇప్పుడు ప్రభుత్వ చేతగాని తనానికి వరంగల్ కూడా బలైందని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ ఎంత గొప్పగా పని చేస్తుందో చెప్పకనే చెబుతున్నారని... కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటనను ఏవిధంగా చూడాలని ప్రశ్నించారు.

తెలంగాణలో రాష్ట్రంలో అత్యంత ప్రధానమైనదీ... కొవిడ్ చికిత్సా కేంద్రంగానూ ఉన్న గాంధీ ఆస్పత్రి పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా పట్టించుకోలేదని వాపోయారు. అగ్నిమాపక వ్యవస్థ నీరుగారిందనన్నారు. ఆవేదనలో ఉన్న అన్నదాతలను కనీస స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితి నెలకొందని విజయశాంతి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వద్దు.. సమన్వయమే కీలకం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.