కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పాటు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాజపా (BJP) మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు (Muralidhar rao) డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత విజయరామారావు (Vijayarama rao) పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి ఇవాళ భాజపా (Bjp)లో చేరారు. అనంతరం పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మురళీధర్ రావు నేతలకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సేవాహి సంఘటన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడం కోసం అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చక పోవడం వల్ల ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని… తల్లిదండ్రులు కోల్పోయి అనాధలుగా మిగిలిన పిల్లలను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.