ETV Bharat / state

COMPLAINT ON ETELA: 'ఈటల అన్యాయం చేశారు.. ​ అవమానకరంగా మాట్లాడారు' - తెలంగాణ తాజా వార్తలు

ఈటల రాజేందర్​ తమకు అన్యాయం చేశారని.. దీనిపై ప్రశ్నిస్తే.. అవమానకరంగా మాట్లాడారని.. చెప్పుకోలేని రీతిలో తిట్టారని విజయలక్ష్మి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ నిర్వాహకురాలు కన్న శివకుమారి (complaint on etela rajender)ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్​ను కోరుతున్నామన్నారు. ఈ మేరకు పౌరసరఫరాల కమిషనర్​కు ఫిర్యాదు చేశారు.

complaint on etela
complaint on etela
author img

By

Published : Oct 12, 2021, 5:49 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తమకు అన్యాయం చేశారని విజయలక్ష్మి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ నిర్వాహకురాలు కన్న శివకుమారి ఆరోపించారు. ఎర్రమంజిల్‌ పౌరసరఫరాల భవన్‌లో ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు (complaint on etela rajender) చేశారు. ఈటలపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం ఇచ్చారు.

హుద్​హుద్​ సమయంలో ఏపీలో కందిపప్పు సరఫరాను బ్యాన్​ చేయడం వల్ల.. సేకరణ కాస్త ఆలస్యం అయిందని శివకుమారి తెలిపారు. దాంతో ఆ సమయంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్​.. తమను కాదని ఇతరులకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. బ్యాంకు రుణం తీసుకోవడం వల్ల అప్పులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు కోటీ 97 లక్షల 57 వేల రూపాయలు చెల్లించి తాము టెండర్​లో పాల్గొంటే తమను కాదని వేరే సంస్థకు కందిపప్పు సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్నారు. అప్పుడు పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్​ తమను బ్లాక్​ లిస్ట్​లో పెట్టారని, అన్యాయానికి గురిచేశారని ఆరోపించారు. ఇకనైనా తమ డబ్బులు ఇప్పించాలని.. తమకు అన్యాయం చేసిన ఈటలపై చర్యలు (COMPLAINT ON ETELA RAJENDER)తీసుకోవాలని సీఎం, డీజీపీకీ ఫిర్యాదు చేస్తామని శివకుమారి తెలిపారు. ఈటల రాజేందర్​పై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్​ చేశారు.

'హుద్​హుద్​ సమయంలో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కందిపప్పు సరఫరాపై బ్యాన్​ విధించింది. ఫలితంగా కందిపప్పు సేకరణ కాస్త ఆలస్యం అయింది. అప్పుడు పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఈటల మమ్మల్ని బ్లాక్​ లిస్ట్​లో పెట్టారు. అప్పుడు ఇంకో టెండర్​ పిలిచి కాంట్రాక్ట్​ ఇచ్చారు. వారు కూడా ఆలస్యం చేసినా.. కేవలం నోటీస్​ ఇచ్చి వదిలేశారు. దీనిపై ప్రశ్నిస్తే.. ఈటల రాజేందర్​ అవమానకరంగా మాట్లాడారు. చెప్పుకోలేని రీతిలో మాట్లాడారు. ఈటల రాజేందర్​ను శిక్షించాలని సీఎం కోరుతున్నా.'

- శివకుమారి, విజయలక్ష్మి ఆగ్రోస్​ ఇండస్ట్రీస్​ నిర్వాహకురాలు

ETELA RAJENDER: 'ఈటల అన్యాయం చేశారు.. ​ అవమానకరంగా మాట్లాడారు'

ఇదీచూడండి: HUZURABAD BYPOLL: హుజూరాబాద్​కు మెడికల్​ కాలేజీ తీసుకొస్తా.: గెల్లు శ్రీనివాస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.