లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార తార విజయశాంతి ముషీరాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. ప్రచారంలో వందల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. దేశాన్ని పాలించే మోదీ, రాష్ట్రాన్ని పాలించే కేసీఆర్ ఇద్దరూ ఒప్పందం ప్రకారమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని విజయశాంతి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి బదులుగా కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం పాటుపడే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. అందరూ హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: జై కిసాన్ నినాదం కాదు మా విధానం: కేటీఆర్