ETV Bharat / state

ప్రైవేటు రంగానికి దీటుగా విజయ డైరీ అడుగులు - vijaya diary

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ రంగమైన విజయ డైరీ అడుగులు వేస్తోంది. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు డైరీల తరహాలోనే గ్రామానికో ధర ఇచ్చి పాలు సేకరించాలని నిర్ణయించింది. కొనుగోలు వ్యూహాలు మార్చి... పాల కొరత ఉన్న గ్రామాల్లో రైతులను ఆకట్టుకునేందుకు తొలిసారి ప్రాంతాల వారీగా ధరలు ఇవ్వనుంది.

vijaya diary steps for the private sector
ప్రైవేటు రంగానికి ధీటుగా విజయ డైరీ అడుగులు
author img

By

Published : Mar 1, 2020, 9:06 AM IST

ప్రైవేటు రంగానికి దీటుగా విజయ డైరీ అడుగులు

రాష్ట్రంలో రైతుల నుంచి పాల కొనుగోలు వ్యూహాలను రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య - విజయ డైరీ మార్చింది. ప్రైవేటు డైరీల మాదిరిగానే ప్రాంతాల వారీగా పాల ధర పెంచి ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. వేసవి సమీపిస్తున్న వేళ... పాల కొరత క్రమంగా పెరుగుతోంది. వేసవి ఎండలకు పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడం సహజం. ఈ నేపథ్యంలో విజయ డైరీకి పాలు పోస్తున్న రైతులను తమ వైపు మళ్లించుకునేందుకు ప్రైవేటు డైరీలు ఒక్కో గ్రామంలో ఒక్కో ధర చెల్లిస్తున్నాయి. ఫలితంగా విజయ డైరీకి పాలు పోసే రైతులు అటు వైపు వెళుతున్నారు. వారిని తిరిగి రప్పించుకునేందుకు విజయ కూడా అదే తీరుగా ధరలు పెంచుతోంది.

పాలకొరత పెరుగుతోంది...

రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఇచ్చే ధర కన్నా... జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో అదనంగా లీటరుకు 2 రూపాయలు ఇస్తుండటం రైతులను ఆకర్షించింది. తిరిగి విజయడైరీకి పాలు పోస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజూ 3 లక్షల 50 వేల లీటర్ల పాలు అవసరం కాగా... ప్రస్తుతం 2 లక్షల 12వేల లీటర్ల పాలు మాత్రమే వస్తున్నాయి. గతేడాది కంటే దాదాపు లక్షన్నర లీటర్ల వరకు పాల సేకరణ తగ్గింది. గత నెలరోజులుగా రాష్ట్రంలో పాల కొరత క్రమంగా పెరుగుతున్నందున ప్రైవేటు డైరీలు గ్రామాల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ ధరలు పెంచి కొంటున్నాయి. దీంతో విజయ డైరీ అధికారులందరినీ గ్రామాలకు పంపి రైతులు చేజారిపోకుండా అవగాహన కల్పిస్తున్నారు.

అదనంగా 2 రూపాయలు చెల్లిస్తూ...

గేదె పాలలో వెన్న 10 శాతం ఉంటే లీటరుకు 60 రూపాయలు చెల్లిస్తున్నారు. కొత్తగా ఎవరైనా పాలు పోయడానికి ముందుకోస్తే అదనంగా మరో 2 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ వ్యుహం రాష్ట్రమంతా అమలుచేస్తే ఎలా ఉంటుందని చర్చించడానికి త్వరలో ప్రభుత్వ స్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుత విజయ డైరీ రోజూ విక్రయాలకు లక్షన్నర లీటర్ల వరకూ పాలు తక్కువగా వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కొంటున్నందున రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. వాటికన్నా ఇక్కడి రైతులకే అదనంగా చెల్లించి కొంటే పాల సేకరణ పెరుగుతుందని భావిస్తున్నారు. వేసవిలో పాల కొరత అధిగమించేందుకు పొడిని పాలుగా మార్చి అనేక డైరీలు విక్రయిస్తున్నాయని అధికారులు తెలిపారు.

మే నాటికి పాల కొరత మరింత అధికమవుతుందని ఇప్పట్నుంచే డైరీలు ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాయి. రోజు వారీ అవసరాల కన్నా... ఎక్కువ పాలు సేకరించినా... వాటిని పొడిగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ... అసలు అవసరాలకే పాలు దొరకడం లేదని ఓ ప్రైవేటు డైరీ యాజమాని వివరించారు.

ఇవీ చూడండి: ఒకే కాన్పులో ఆరుగురికి జన్మ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.