Vijaya diet milk : డైటింగ్ చేసేవారి సంఖ్య పెరుగుతున్నందున వారి కోసం ప్రత్యేకంగా పాలు విక్రయిస్తున్నట్లు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) తెలిపింది. వీరి కోసం ‘డైట్ మిల్క్’ను లీటరు రూ.50కి విక్రయిస్తారు. గతంలో దీని ధర రూ.46 ఉండేది. టోన్డ్ మిల్క్ లీటరు ధరను రూ.51 నుంచి 55కి పెంచారు. ‘హోల్‌మిల్క్’ పేరుతో విక్రయిస్తున్న పాల లీటరు ధరను రూ.68 నుంచి 70కి పెంచినట్లు విజయ డెయిరీ తెలిపింది.
అలాగే కేవలం టీ(చాయ్) తయారీకి వినియోగించేందుకు ‘టీ స్పెషల్’ పేరుతో మరో రకం పాలను విడిగా అమ్ముతున్నారు. వీటి ధరను లీటరుకు రూ.50 నుంచి 54కి పెంచారు. అయితే నెలవారీ పాలకార్డులు కొనుగోలు చేసిన వారికి ఈ నెల 13 వరకూ పాత ధరలపైనే విక్రయిస్తామని, చిల్లరగా కొనేవారు పెంచిన ధరలనే చెల్లించాలని డెయిరీ సూచించింది.