ETV Bharat / state

విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు సందేశాలు పంపిన వ్యక్తి అరెస్ట్​

హీరో విజయ్ దేవరకొండ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఐడీలతో అమ్మాయిలను ట్రాప్​ చేస్తోన్న వ్యక్తిని హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు అరెస్టు చేశారు. విజయ్​ దేవరకొండను కలవాలంటే ఈ నంబర్​కు ఫోన్​ చేయాలంటూ నిందితుడు సోషల్​ మీడియాలో పోస్టింగ్​లు పెట్టినట్లు అర్జున్ రెడ్డి​ మేనేజర్​ సీసీఎస్​లో ఫిర్యాదు చేశారు.

arrested-for-sending-messages-to-girls-under-the-name-of-vijaya-devarakonda
విజయదేవరకొండ పేరుతో అమ్మాయిలకు సందేశాలు పంపిన వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Mar 6, 2020, 9:11 PM IST

సామాజిక మాధ్యమాల్లో సినీ హీరో విజయ్​ దేవరకొండ పేరుతో తన ఫోన్​ నంబర్​ పెట్టి అమ్మాయిలను ట్రాప్​ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్​దేవరకొండను కలవాలంటే ఈ నంబర్​కు ఫోన్​ చేయాలని సోషల్​ మీడియాలో పోస్టింగ్​లు పెడుతూ... అమ్మాయిలతో చాట్​ చేస్తున్నట్లు విజయ్​ దేవరకొండ మేనేజర్​ గోవింద్ ఈనెల 3న​ సీసీఎస్​లో ఫిర్యాదు చేశాడు.

ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడి ఫేస్​బుక్​ ఐడీ, మొబైల్​ నంబర్​ ఆధారంగా బాన్సువాడ మిర్జాపూర్​ గ్రామంలో నిందితుడు సాయికిరణ్​ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్​కు తరలించారు. విచారించిన అనంతరం 41ఏ సీఆర్పీసీ కింద నోటిసులు జారీ చేసినట్లు ఏసీపీ ప్రసాద్​ తెలిపారు.

విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు సందేశాలు పంపిన వ్యక్తి అరెస్ట్​

ఇదీ చూడండి: అవినీతి ఉద్యోగులకు ఇకనుంచి పాస్​పోర్టు​ కట్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.