వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం పదివేలు అందడం లేదంటూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు చోట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. తెరాస కార్యకర్తలకే డబ్బులు ఇస్తున్నారని, అసలైన బాధితులకు సాయం అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాంనగర్, శ్రీరామ్ నగర్ డివిజన్లలో ప్రజలు రోడ్లపైకి వచ్చి బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ విషయంపై స్థానిక తెరాస నేతలకు బాధితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే చిక్కడపల్లి పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఆర్థికసాయంపై సంబంధిత అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం వల్ల బాధితులు ఆందోళన విరమించారు.
ఇవీచూడండి: వరద సాయం కోసం నగరంలో పలుచోట్ల బాధితుల ఆందోళన