ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా... భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు, సంస్థలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో డక్కన్ డైలాగ్ అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక దౌత్యం అనే అంశంపై ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ... దేశ ఆర్థిక ప్రణాళికలు, భద్రతలో దౌత్యం కీలకపాత్ర వహిస్తుందని తెలిపారు. అభివృద్ధి అనేది కొన్ని నగరాలకే పరిమితం కాకుండా... ఇతర ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఇవీ చూడండి: కంటైనర్లో చిక్కిన ఎలుగు పిల్లను కాపాడారిలా!