ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన మిత్రుడికి ఫోన్ చేసి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందిగామ కేవీఆర్ కళాశాల విశ్రాంత సూపరింటెండెంట్, విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి వెచ్చా ఉమామహేశ్వర గుప్తాకు శుక్రవారం ఉదయం ఉపరాష్ట్రపతి ఫోన్ చేశారు. ఆరోగ్యం ఎలా ఉందని, మిత్రులంతా ఎక్కడెక్కడ ఉన్నారని అడిగారని గుప్తా తెలిపారు. మిత్రుల ద్వారా తన ఫోన్ నంబరు తీసుకుని మరీ వెంకయ్యనాయుడు ఫోన్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ‘జై ఆంధ్ర’ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన వెంకయ్యనాయుడు.. ఆ సమయంలో నందిగామకు తరచూ వస్తుండేవారని, అప్పటి నుంచి తమకు పరిచయం ఉందన్నారు.
స్నేహితుడికి ఉపరాష్ట్రపతి ఫోన్... ఆరోగ్యంపై ఆరా!
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన మిత్రుడైనా నందిగామ కేవీఆర్ కళాశాల విశ్రాంత సూపరింటెండెంట్ వెచ్చా ఉమామహేశ్వర గుప్తాకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.