దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చిన వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. పీవీ నరసింహారావుపై ప్రముఖ రచయిత ఎ. కృష్ణారావు రాసిన విప్లవ తపస్వి-పీవీ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
పంచాయతీ నుంచి మున్సిపాలిటీల వరకు అన్ని రంగాల్లో పీవీ చొరవ తీసుకున్నారని కొనియాడారు. సంస్కరణలకు ఆద్యుడిగా అభివర్ణించారు. పీవీకి తగినంత గౌరవం దక్కలేదని వెంకయ్య వాపోయారు. పార్టీ లోపల, బయట కూడా రావాల్సిన గౌరవం దక్కలేదన్నన్నారు.
పీవీ నరసింహారావు తెలుగు వ్యక్తి కావడం, సాహితీవేత్త, బహు భాషా కొవిదుడు... అసామాన్యుడని కొనియాడారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి తపస్విలాగా పట్టుదలతో పనిచేశారని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఇదీ చదవండి: 2021లో ప్రపంచ రక్షకుడుగా భాగ్యనగరం.. కొవిడ్‌పై యుద్ధభేరి