ETV Bharat / state

ఉపరాష్ట్రపతి దాతృత్వం: యువతి శస్త్రచికిత్సకు సాయం

అనారోగ్యంపాలైన ఓ యువతికి ఆర్థిక సాయం చేసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దాతృత్వం చాటుకున్నారు. తన కుమార్తె శస్త్రచికిత్సకు సాయం అందించాలన్న ఓ తండ్రి లేఖకు ఆయన స్పందించారు.

vice-president-assists-a-young-woman-in-surgery-at-nellore in ap
ఉపరాష్ట్రపతి దాతృత్వం: యువతి శస్త్రచికిత్సకు సాయం
author img

By

Published : Dec 9, 2020, 1:11 PM IST

అనారోగ్యంతో ఉన్న ఓ యువతికి ఆర్థిక సాయం చేసి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మానవత్వాన్ని చాటుకున్నారు. తన కుమార్తె శస్త్రచికిత్సకు సాయం అందించాలన్న ఓ తండ్రి లేఖకు ఆయన స్పందించారు. సొంత నిధులతో సహా రూ.18 లక్షల మేర సేకరించి.. బాధిత కుటుంబానికి అందజేశారు. నెల్లూరుకు చెందిన చెంచుకుమార్‌ సూళ్లూరుపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె దివ్యశ్రీ ఎంసీఏ పూర్తిచేశారు. ఆమె కొన్నాళ్లుగా ఫాంకొనీ అనిమియాతో బాధపడుతున్నారు. బోన్‌మ్యారో మార్పిడి శస్త్రచికిత్స చేయాలని... అందుకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అంత భరించలేక.. బాధితురాలి తండ్రి ఉపరాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాశారు. ఉప రాష్ట్రపతి స్పందించి యువతి వైద్యానికి తమ వంతుగా ఆయన సతీమణి ఉషమ్మ ద్వారా రూ.లక్ష, ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి రూ.75 వేలు వెంటనే విడుదల చేయించారు. ప్రధానమంత్రి సహాయ నిధి ద్వారా రూ.3 లక్షలు విడుదలయ్యేలా చొరవ తీసుకున్నారు. స్వర్ణభారత్‌ ట్రస్టు తరఫున మరో రూ.లక్ష, కుమారుడు హర్షవర్థన్‌, కుమార్తె దీపా వెంకట్ వ్యక్తిగతంగా చెరో రూ.లక్ష చొప్పున సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

ఆయన మిత్రులు బి.సుబ్బారెడ్డి (వంశీరామ్‌ బిల్డర్స్‌) రూ.5 లక్షలు, రవిరెడ్డి సన్నారెడ్డి (శ్రీసిటీ) రూ.2.25 లక్షలు, సి.వెంకటేశ్వరరెడ్డి (అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌) రూ.2 లక్షలు, సి.సుబ్బారెడ్డి (సీ బ్రోస్‌ కన్‌స్ట్రక్షన్స్‌) రూ.లక్ష సేకరించారు. మొత్తం రూ.18 లక్షలు ఆ కుటుంబానికి అందేలా చూశారు.

ఇదీచూడండి: నేను ఏ పార్టీకి అమ్ముడుపోలేదు: ఆర్వో లీనా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.