ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఏప్రిల్‌లోపు ప్రభుత్వం స్పందించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. మార్చి 4వ తేదీన పార్లమెంట్‌లో అన్ని పార్టీల ఎంపీలను కలిసి ఈ సమస్యను లోక్‌సభలో లేవనెత్తాలని కోరనున్నట్లు వీహెచ్ తెలిపారు.
ఇదీ చూదవండి: రెండు లారీలు ఢీ.. క్షేమంగా బయటపడ్డ పాదచారి