రాష్ట్ర ప్రభుత్వం హిందూ సంప్రదాయాన్ని కాలరాస్తోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ధ్వజమెత్తాడు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటికలోపల రామరాజు నేతృత్వంలో వీహెచ్‌పీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. రోడ్డు వెడల్పు పేరుతో శ్మశానవాటికను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. స్మశానవాటిక చుట్టూ ఉన్న ప్రహారీ గోడను కూల్చివేయడంతోపాటు లోపలిస్థలాన్ని చదును చేస్తున్నారని మండిపడ్డారు. ప్రహారీ గోడ లోపల సమాధులను తొలగిస్తున్నారని ఇది హిందూ సంప్రదాయానికి విరుద్దమన్నారు. రోడ్డు వెడల్పు కోసం శ్మశానవాటిక స్థలాన్ని అక్రమించి చదును చేస్తే హిందువుల పూర్వీకుల అస్తికలు బయటపడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శ్మశానవాటిక ప్రహారీ గోడ తొలగింపు పనులను నిలిపివేయాలని రామరాజు డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి : Etela: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రోడ్‌షో