తెరాస నాయకుల చేతిలో గాయపడిన సిర్పూర్ కాగజ్‌నగర్ అటవీ రేంజ్ అధికారి అనితను ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎంపీ వి.హనుమంతరావు పరామర్శించారు.
హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాడికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. దోషులను కఠినంగా శిక్షించి అధికారులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : సచివాలయం పరిశీలించిన కాంగ్రెస్ నేతలు