భాజపాపై నిత్యం పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీలో కలవడం ఏంటని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం మా వాళ్లు కొన్ని చోట్ల... కమలం పార్టీతో జతకట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల నిత్యం భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలపై కొట్లాడే నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు.
ఇలాంటి నిర్ణయాలతో ముస్లింలు పార్టీకి దూరం అవుతారని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంత విషయంలో తాను వైఎస్‌ఆర్‌నే వదల్లేదని ఆయన చెప్పుకోచ్చారు. పార్టీ అంతర్గత సమావేశంలో చెప్పిన ప్రయోజనం ఉండటం లేదని...దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని హనుమంతరావు తెలిపారు.
ఇవీ చూడండి సమత హత్యాచార కేసు నిందితులకు మరణ శిక్ష