ETV Bharat / state

కేసీఆర్ నీకు వారం సమయమిస్తున్నా: వీహెచ్​ - vh press meet

ముఖ్యమంత్రి కేసీఆర్​పై వీహెచ్​ గాంధీభవన్​లో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్​రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వారంరోజుల్లోగా గ్రామంలోని బాధిత కుటుంబాలని కలిసి పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

'కేసీఆర్ నీకు వారం రోజులు సమయమిస్తున్నా'
author img

By

Published : May 29, 2019, 4:11 PM IST

Updated : May 29, 2019, 4:17 PM IST

హాజీపూర్​ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్​రెడ్డిపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్య తీసుకోలేదని గాంధీభవన్​లో వీహెచ్​ మండిపడ్డారు. పోలీసు కస్టడీలని, విచారణలని సమయం వృథా తప్ప ఏం లాభం లేదని పేర్కొన్నారు. 'మా నాన్న చాలా బాధ పడుతుండని కేటీఆర్ ట్విట్టర్​లో పోస్ట్​ చేయడమే తప్ప ఏ రోజైనా అక్కడికి వెళ్లి పరామర్శించలేదన్నారు. ఆ ప్రాంతంలో గెలిచిన శాసనసభ్యలు కేవలం వారిని కలిసిరావడమే తప్ప బాధితులకు పరిహారం చెల్లించాలనే ఆలోచన లేదని ఆగ్రహించారు. వెంటనే బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వారం రోజుల్లోగా హాజీపూర్​ గ్రామానికి వెళ్లి పరామర్శించాలని కోరారు.

'కేసీఆర్ నీకు వారం రోజులు సమయమిస్తున్నా'

ఇదీ చూడండి: 'సున్నా వేయడం వాళ్ల హక్కు... అంతే వేస్తాం'

Last Updated : May 29, 2019, 4:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.