రైతుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష విరమించారు. అంబర్‌పేటలోని తన నివాసంలో చేపట్టిన దీక్షను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి... వీహెచ్‌ను పరామర్శించి దీక్షను విరమింపజేశారు. హనుమంతరావు దీక్ష చేయడం అభినందనీయమని ఉత్తమ్ పేర్కొన్నారు. వీహెచ్ లేవనెత్తిన డిమాండ్ల పట్ల పార్టీలో చర్చించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అన్ని జిల్లాల కార్యాలయాలలో ఒకరోజు దీక్ష చేస్తామన్నారు. కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
ఇవీ చూడండి: ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి