ETV Bharat / state

అంబేడ్కర్ విగ్రహాన్ని కిడ్నాప్​ చేశారు : వీహెచ్​ - Ambedkar statue was kidnapped

తానూ పంజాగుట్ట కూడలిలో పెట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని కిడ్నాప్​ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విగ్రహాం గోషామహల్ పోలీస్​స్టేషన్​లో ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఛలో గోషామహాల్ కార్యక్రమం పేరుతో ఆందోళన నిర్వహిస్తానని అన్నారు.

vh hanumantha rao said The Ambedkar statue was kidnapped
అంబేడ్కర్ విగ్రహాన్ని కిడ్నాప్​ చేశారు : వీహెచ్​
author img

By

Published : Sep 23, 2020, 3:33 PM IST

Updated : Sep 23, 2020, 3:41 PM IST

అంబేడ్కర్ విగ్రహాన్ని కిడ్నాప్​ చేశారు : వీహెచ్​

అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి పంజాగుట్ట కూడలిలో ప్రతిష్ఠించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కిడ్నాప్ చేసి గోషామహల్ పోలీస్​ స్టేషన్​లో పెట్టారని పేర్కొన్నారు. రాజ్యాంగం రాసిన అధినేతను అవమాన పరిస్తే తానూ ఉండలేక విగ్రహం కోసం ఐదు లక్షలు ఖర్చపెట్టి తెచ్చినట్లు వెల్లడించారు.

ఆ విగ్రహాన్ని పంజాగుట్టలో పెట్టిన తర్వాత దుండగులు కిడ్నాప్​ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో సీఎల్​పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీస్​స్టేషన్‌లో పెట్టిన విషయం దేశ ప్రజలందరికి తెలియాలన్నారు. ఛలో గోషామహాల్ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి తీసుకువెళతానని హెచ్చరించారు.

ఇదీ చూడండి : వేధిస్తున్నారా..? ఒక్క ట్విట్‌ చాలు!

Last Updated : Sep 23, 2020, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.