రాష్ట్రంలో త్వరలోనే మరో ఎన్నికలు జరగనున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పాలకమండళ్ల పదవీకాలం పూర్తవడం వల్ల పీఏసీఎస్‌లకు గతంలోనే పర్సన్ ఇన్ఛార్జ్లను నియమించారు. పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల పదవీకాలం కూడా త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మూడు, నాలుగు రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పక్షం రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి పీఏసీఎస్‌లకు కొత్త పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.
'పక్షం రోజుల్లోగా పీఏసీఎస్‌ల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి' - ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు
!['పక్షం రోజుల్లోగా పీఏసీఎస్‌ల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి' telangana primary agricultural cooperatives elections very soon latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5886738-60-5886738-1580317451957.jpg?imwidth=3840)
18:44 January 29
త్వరలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు