ETV Bharat / state

తెలంగాణలో కుటుంబాల కంటే వాహనాల సంఖ్యే ఎక్కువట.. ఎన్ని ఉన్నాయో తెలుసా..?

Vehicles are More than Families in Telangana: సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి కాలంలో ప్రతి రంగంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయో మానవ రంగంలోనూ అలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. తమ దేహాలను కష్టపెట్టకుండా సులువైన మార్గాలను ఎంచుకుంటున్నారు ప్రజలు. కొద్ది దూరం నడవాలన్నా వాహనం తీసే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు చూద్దామంటే కనపడని వాహనాలు.. నేడు కుటుంబాలను దాటేసి రికార్డు సృష్టిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటి సంఖ్య భారీగా పెరుగుతోంది.

author img

By

Published : Mar 27, 2023, 12:06 PM IST

Vehicles
Vehicles

Vehicles are More than Families in Telangana: రాష్ట్రంలో ఏటేటా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం కుటుంబాల సంఖ్యను మించి పోయింది. తెలంగాణలో ఇరవై లక్షల కుటుంబాలు ఉంటే.. వాహనాల సంఖ్య మాత్రం కోటీ యాభై మూడు లక్షలు దాటింది. తెలంగాణ రవాణా శాఖ తాజా గణాంకాల ప్రకారం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటికి 71.52 లక్షల వాహనాలు తెలంగాణలో ఉన్నాయి. అదే ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 1.53 కోట్లు దాటగా.. అందులో బైకులు 73.7 శాతం ఉండగా.. కార్లు 13 శాతంగా ఉన్నాయి. వీటి తర్వాతి స్థానం ట్రాక్టర్లదే. ఒకవైపు వ్యక్తిగత వాహనాలు విపరీతంగా పెరుగుతుండగా.. ప్రజా రవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సులు మాత్రం తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 10,479 నుంచి 9,164కి అంటే 12.5 శాతం బస్సులు తగ్గాయి.

ఇదిలా ఉంటే వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లతో రవాణా శాఖకు భారీ ఆదాయం సమకూరుతోంది. గత తొమ్మిదేళ్లలో 320 శాతం, నిరుటితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 52 శాతానికి పైగా ఆదాయం పెరిగిట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే రికార్డు. నూతన రాష్ట్రంలో సంపద సృష్టి, కుటుంబాల ఆదాయంలో పెరిగిన వృద్ధి ఫలితంగానే వాహనాల సంఖ్య పెరుగుతోందని ఆ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

భారీగా పెరిగిన ట్రాక్టర్లు : ట్రాక్టర్లు, ట్రైలర్‌ల సంఖ్య కూడా రాష్ట్రంలో భారీగానే పెరుగుతోంది. గడిచిన తొమ్మిదేళ్లలో వీటి సంఖ్య 2.69 లక్షల నుంచి ఫిబ్రవరి 23 నాటికి 6.96 లక్షలకు (258 శాతం) పెరిగింది. మార్చి నెలాఖరుకు ఈ సంఖ్య ఏడు లక్షలను దాటే అవకాశమూ లేకపోలేదు. వ్యవసాయ విస్తీర్ణం బాగా పెరుగుతుండటం, దానికి తగినట్లు కూలీల కొరత ఏర్పడడంతో ట్రాక్టర్లను కొనుక్కునే రైతుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి ఓ ట్రాక్టర్‌ ఇవ్వడమూ ఓ కారణంగా చెప్పవచ్చు. మరోవైపు నదులు, ఉప నదుల్లోని ఇసుక ఆదాయ వనరుగా మారడంతో సమీప గ్రామాల్లో ట్రాక్టర్ల సంఖ్య విపరీతంగా పెరగడమూ ఇంకో ముఖ్య కారణంగా కనబడుతోంది.

అంతంతమాత్రంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు : ఒకవైపు దేశంలో డీజిల్‌, పెట్రోల్ ధరలు పెద్దఎత్తున పెరుగుతున్నప్పటికీ వాటితో నడిచే వాహనాల కొనుగోళ్ల దూకుడు మాత్రం తగ్గడం లేదు. కాలుష్యాన్ని, అంతకుమించి ఇంధన ఖర్చుల్ని భారీగా తగ్గించే విద్యుత్ వాహనాల అమ్మకాలు తెలంగాణలో ఇంకా ఊపందుకోలేదు. ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య మాత్రం రాష్ట్రంలో 60 వేల లోపే ఉంది. మొత్తం వాహనాల్లో ఈ వాహనాలు కేవలం 0.37 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.