ETV Bharat / state

వాహన పన్ను రద్దుతో నిర్వాహకుల్లో ఆనందం - తెలంగాణలో వాహన పన్ను రద్దు

కరోనా సంక్షోభం దృష్ట్యా వాహన పన్ను రద్దు చేయడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల పట్ల సీఎం కేసీఆర్​ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. లాక్​డౌన్​లో తీవ్రంగా నష్టపోయిన ట్రాన్స్​పోర్టు నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.

vehice tax cancelled by ts government
వాహన పన్ను రద్దుతో నిర్వాహకుల్లో ఆనందం
author img

By

Published : Nov 23, 2020, 7:32 PM IST

కొవిడ్​ సంక్షోభం దృష్ట్యా వాహన పన్ను రద్దు చేయడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పెద్ద మనుసుకు ఇదొక నిదర్శనమని మంత్రి కొనియాడారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహారిస్తోందని పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌లో తీవ్రంగా నష్టపోయామని జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌పోర్టు వాహనాల నిర్వాహకుల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రూ. 267 కోట్ల మేర మాఫీ చేయాలని నిర్ణయించడం హర్షించదగినదని మంత్రి పువ్వాడ తెలిపారు.

మార్చి నుంచి సెప్టెంబ‌రు వ‌ర‌కు అంటే రెండు త్రైమాసికాలకు వాహ‌న ప‌న్నును మాఫీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రక‌టించింది. దీంతో జంట‌న‌గ‌రాల‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ర‌వాణా వాహ‌నాల నిర్వాహ‌కుల్లో ఆనందం వెల్లివిరిసిందని పువ్వాడ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'హైదరాబాద్‌ను విశ్వనగరం కాదు.. విషాద నగరం చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.