రైతు బజార్లలో కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధరలు పెంచకుండా అమ్మాలని సూచించినా... ధరల నియంత్రణలో అధికారులు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. లింగంపల్లిలోని రైతు బజార్లో భారీ మొత్తంలో కూరగాయల ధరలు పెంచేశారని... ఇలా అయితే సామాన్య ప్రజలు ఏమితిని బతకాలని ప్రశ్నిస్తున్నారు.
మొన్నటి వరకు కిలో రూ.15 ఉన్న టమోటా ధర ఇవాళ ఒక్కసారిగా రూ.100 దాటి పోయిందని.. ఏ కూరగాయలు చూసుకున్నా కిలో వందకు తక్కువ లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు