ETV Bharat / state

లాక్​డౌన్ అడ్డుపెట్టుకుని రిటైల్ దోపిడి..​ - తెలంగాణలో లాక్​డౌన్

లాక్​డౌన్​ను అడ్డుపెట్టుకుని రిటైల్ వ్యాపారులు దోచుకుంటున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా.. లాక్​డౌన్​ సమయాల్ని అడ్డుపెట్టుకుని కూరగాయ ధరలు పెంచేసి ప్రజలపై భారం మోపుతున్నారు.

vegetable-prices-double-during-lockdown
రెట్టింపైన కూరగాయల ధరలు
author img

By

Published : May 13, 2021, 11:28 AM IST

ఒకటి కొంటే ఒకటి ఉచితం.. మరి లేదు..

సూపర్‌ మార్కెట్లలో ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ ఆఫర్లు ఉండేవి. ఇప్పుడవేవీ కనిపించడం లేదు. కవరు పైనే ఎమ్మార్పీ ధరలు ఉండబట్టి దానిని పెంచడానికి వీలు పడలేదు కాని.. లేకుంటే వాటి ధరలు కూడా పెంచేసేవారని సత్యనారాయణ అనే వినియోగదారుడు పేర్కొన్నారు. కూరగాయల ధరలు నిన్నటికి ఈ రోజుకు రెట్టింపు అయ్యాయని కావాలనే కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుకోవాలని చూస్తున్నారన్నారు. బుధవారం ఉదయం 6 గంటలకే దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. రైతుబజార్లు కూడా ఇదే సమయాన్ని పాటించాయి. నిన్న రాత్రి వరకూ ఎంతో హడావిడిగా సరకులు కొన్న నగరవాసులు.. బుధవారం కాస్త ప్రశాంతంగానే సూపర్‌ మార్కెట్లకు వచ్చి కొనుగోలు చేశారు. ఆయా దుకాణాలకు స్టాకును కూడా ఉదయం 10 గంటల లోపే నిర్వాహకులు తెచ్చారు.

రూపాయలలో ఇలా.. కూరగాయ రైతుబజారు రిటైల్‌

కిలో కూరగాయలు రూ.. రిటైల్‌ ధర
1 టమాటా 10 15-20
1 నల్ల వంకాయ 15 20-30
1 బెండకాయ 18 25-35
1 పచ్చి మిర్చి 23 35-40
1 బీరకాయలు 33 40-45
1 క్యారెట్‌ 25 35-40
1 దొండకాయ 18 25-30
1 బీన్స్‌ 70 90-95
1 ఉల్లిగడ్డలు 19 25-30

సంచార రైతుబజార్లే పరిష్కారం..

లాక్‌డౌన్‌ పేరిట లూటీ చేయాలనుకునే రిటైల్‌ వ్యాపారులకు సంచార రైతుబజార్లు సరైన పరిష్కారం అని పలువురు కాలనీవాసులు పేర్కొంటున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ పెట్టినప్పుడు కాలనీలకే కూరగాయలు పంపి ఇబ్బంది లేకుండా చేశారని.. ఈ సారి కూడా అలాగే సంచార రైతు బజార్లను కాలనీలకు పంపాలని కోరుతున్నారు. రైతుబజారుకు ఉదయాన్నే వెళ్తే రద్దీ ఎక్కువ ఉంటోందని వాపోతున్నారు. కూరగాయలు తెచ్చిన రైతులు సరకును దించి.. రాసిగా పోసిన తర్వాత 8 గంటల నుంచి కూరగాయలు కొనుక్కోవడానికి గతంలో అవకాశం ఉంటే.. ఇప్పుడు.. రైతులతో పాటు.. కొనుగోలుదారులు కూడా ఉదయం 6 గంటలకే రావాల్సి రావడంతో ఇబ్బంది ఏర్పడుతోందని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఊరికే పోదాం.. ఉన్నదే తిందాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.