సికింద్రాబాద్ కార్ఖానాలోని బస్తీల్లో నివాసముంటున్న పేదలకు వాసవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. అసోసియేషన్ సభ్యులు ఇంటింటికి తిరిగి 2500 కిలోల కూరగాయలను అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్ గుప్తా తెలిపారు. కూరగాయలు అందించిన వాసవి క్లబ్ సికింద్రాబాద్ అధ్యక్షుడు మోహన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: పసిబిడ్డకు 'శానిటైజర్'గా నామకరణం