సైబరాబాద్ పోలీసులకు హాలా స్కూటర్స్ సంస్థ 20 ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేసింది. సంస్థ సీఎఫ్‌ఓ ఆనంద్ పారేక్ స్కూటర్లను సైబరాబాద్ సీపీ సజ్జనార్ (VC Sajjanar)కు అందజేశారు. ఒక వ్యక్తి మాత్రమే నడపించగల ఎలక్ట్రిక్ స్కూటర్ల వలన క్షేత్ర స్థాయిలో పోలీసులు సులభంగా పెట్రోలింగ్ నిర్వహించుకోవచ్చని సంస్థ సీఎఫ్‌ఓ తెలిపారు.
వాటిని మూడు గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆ వాహనాలకు ఎటువంటి అద్దె చెల్లించకుండా మూడు నెలల పాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులు ఉపయోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మహిళా భద్రత విభాగం డీసీపీ అనసూయ, నేర విభాగం డీసీపీ కవిత, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: E-pass: అడిగిన వాళ్లందరికీ ఈ-పాస్‌లు ఇవ్వలేం: డీజీపీ