Hyderabad Bengalore Vande Bharat Express Ticket Price : తెలంగాణ రాష్ట్రంలో మూడో వందేభారత్ రైలు నేటి నుంచి పరుగులు పెట్టనుంది. ఇవాళ కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా.. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు మూడో వందేభారత్ రైలు కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య పరుగులు పెట్టనుంది.
ఈ స్వదేశీ సెమీ హైస్పీడ్ రైలు హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమై.. బెంగళూరు నగరంలోని యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ వరకు వెళుతుంది. మహబూబ్‌నగర్, కర్నూలు టౌన్, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్లలో వందేభారత్ ఆగుతుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య 610 కిలోమీటర్ల దూరాన్ని.. 8 గంటల 30 నిమిషాల వ్యవధిలో చేరుకుంటుంది.
Kacheguda- Yesvantpur Vandebharat Express : ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే ఇది దాదాపు 2 గంటల 50 నిమిషాలు.. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోనుంది. వందేభారత్ రెగ్యులర్ సర్వీసులు ఈ నెల 25వ తేదీ నుంచి యశ్వంత్‌పూర్ నుంచి ప్రారంభం కానున్నాయి. 26వ తేదీ కాచిగూడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రైలు 8 కోచ్‌లతో నడుస్తుంది. 7 ఏసీ చైర్‌కార్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కోచ్ ఉంటాయి. 530 సీట్ల సామర్థ్యం కలిగివున్న ఈ రైలు.. బుధవారం మినహా వారంలో మిగిలిన 6 రోజులు సర్వీసులో ఉంటుంది.
విజయవాడ- చెన్నై సెంట్రల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. విజయవాడ, తమిళనాడులోని చెన్నై సెంట్రల్ మధ్య ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా వందేభారత్ రైలు పరుగులు తీస్తుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి ఉదయం 5.30కు ప్రారంభమై.. మధ్యాహ్నం 2.00లకు యశ్వంతపూర్‌కు చేరుకుంటుంది. మళ్లీ తిరిగి మధ్యాహ్నం 2.45కు యశ్వంతపూర్ నుంచి ప్రారంభమై.. రాత్రి 11.15కు కాచిగూడకు చేరుకుంటుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఛార్జీల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అని రైల్వే శాఖ వెల్లడించింది. క్యాటరింగ్ ఛార్జీలు ప్రయాణికులు ఎంచుకునేవిధంగా టిక్కెట్‌లను బుక్ చేసేటప్పుడు ఎంచుకునే వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
Kacheguda- Yesvantpur Vandebharat Ticket Prices : కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ వరకు క్యాటరింగ్ ఛార్జీతో సహా ఏసీ చైర్‌కార్ ఛార్జీ రూ.1,600లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2,915లుగా నిర్ణయించారు, యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడకు క్యాటరింగ్ ఛార్జీతో సహా ఏసీ చైర్‌కార్ ఛార్జీ రూ.1,540లు, ఎగ్జిక్యూటివ్ తరగతి ధర రూ.2,865గా నిర్ణయించారు. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌కు క్యాటరింగ్ ఛార్జీలు మినహాయిస్తే ఏసీ చైర్‌కార్ ఛార్జీ రూ.1,255లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2,515లుగా నిర్ణయించారు. యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడకు క్యాటరింగ్ ఛార్జీలు మినహాయిస్తే ఏసీ చైర్‌కార్ ఛార్జీ రూ.1,255లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2515గా నిర్ణయించారు.
-
Hon'ble PM Shri @narendramodi will flag off 9 #VandeBharat Express (through Video Conferencing) connecting different places today.#Hyderabad - #Bengaluru
— South Central Railway (@SCRailwayIndia) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Vande Bharat Express flagging off live Streaming Link:https://t.co/hR0dbbOcqO pic.twitter.com/7TtfotzePG
">Hon'ble PM Shri @narendramodi will flag off 9 #VandeBharat Express (through Video Conferencing) connecting different places today.#Hyderabad - #Bengaluru
— South Central Railway (@SCRailwayIndia) September 24, 2023
Vande Bharat Express flagging off live Streaming Link:https://t.co/hR0dbbOcqO pic.twitter.com/7TtfotzePGHon'ble PM Shri @narendramodi will flag off 9 #VandeBharat Express (through Video Conferencing) connecting different places today.#Hyderabad - #Bengaluru
— South Central Railway (@SCRailwayIndia) September 24, 2023
Vande Bharat Express flagging off live Streaming Link:https://t.co/hR0dbbOcqO pic.twitter.com/7TtfotzePG