ETV Bharat / state

అప్పు తీసుకున్నారు.. అది తీర్చేందుకు అతని వద్దే డబ్బు కొట్టేశారు - వనస్థలిపురం దోపిడీ కేసు అప్డేట్

Vanasthalipuram Robbery Case : హైదరాబాద్‌ వనస్థలిపురం దోపిడీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసి.. వారి నుంచి దోపిడీ చేసిన రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Vanasthalipuram Robbery Case
Vanasthalipuram Robbery Case
author img

By

Published : Jan 16, 2023, 1:02 PM IST

Updated : Jan 16, 2023, 4:03 PM IST

Vanasthalipuram Robbery Case : హైదరాబాద్ వనస్థలిపురంలో ఇటీవల చోటుచేసుకున్న దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దారి దోపిడీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యాపారి వద్ద ఈనెల 6వ తేదీన కొందరు దుండగులు నగదు దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పది రోజుల్లోనే కేసును ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ చౌహాన్‌ వెల్లడించారు.

దోపిడీ తర్వాత నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోయారని సీపీ చౌహాన్ పేర్కొన్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించామని.. నలుగురిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నాడని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దోపిడీ కేసును ఛేదించామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దోపిడీ చేశారని సీపీ చెప్పారు. బార్‌ యజమాని వెంకట్ రెడ్డి వద్ద నిందితులు అప్పు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి వచ్చి డబ్బు కొట్టేయాలని ప్రణాళిక వేశారని వివరించారు. రూ.50 లక్షలు దోపిడీ చేసి రాష్ట్రం వదిలి పారిపోవాలని ప్రణాళిక వేశారన్నారు. డబ్బు తీసుకుని ముంబయి పారిపోయారని.. ముంబయి నుంచి విదేశాలకు వెళ్లాలని ప్రణాళిక వేశారని అన్నారు. పారిపోయే క్రమంలో నిందితులను పట్టుకున్నామని సీపీ చౌహాన్‌ వెల్లడించారు.

బార్‌ యజమాని వెంకట్ రెడ్డి వద్ద నిందితులు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చడానికి వచ్చి డబ్బు కొట్టేయాలని ప్రణాళిక వేశారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దోపిడీ చేశారు. దోపిడీ చేసిన డబ్బు తీసుకుని ముంబయి పారిపోయారు. ముంబయి నుంచి విదేశాలకు వెళ్లాలని ప్రణాళిక వేశారు. పారిపోయే క్రమంలో నిందితులను పట్టుకున్నాం. ఈ దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించాం. నలుగురిని అరెస్ట్ చేశాం. మరొకరు పరారీలో ఉన్నారు. - రాచకొండ సీపీ చౌహాన్‌

అసలేం జరిగిందంటే.. ఈనెల 6వ తేదీన వనస్థలిపురంలో ఎం.ఆర్.ఆర్ బార్​ను నిర్వహిస్తున్న వెంకట్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. తాను నగదుతో వెళ్తుండగా.. కొందరు దుండగులు దాడి చేసి తన వద్ద నుంచి రూ.2 కోట్లు దోచుకున్నారని పోలీసులకు వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా అదే రోజున సంఘటనా స్థలికి వెళ్లి చూడగా వాహనంలో రూ.25 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. యజమాని వెంకట్‌రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఓ ఫ్లాట్‌ ఒప్పందం కోసం వెంకట్‌రెడ్డి అనే వ్యాపారి 50 లక్షల రూపాయలు తీసుకోగా... అతని నుంచి దుండగులు ఆ డబ్బును దోచుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వెంకట్‌రెడ్డి పోలీసులకు 50 లక్షలు పోయాయని ఫిర్యాదు చేయగా అతనితో పాటు ఉన్న నరేష్‌ అనే వ్యక్తి కోటిన్నర పోయాయని ఫిర్యాదు చేశారు.

పోలీసులు విచారణలో సీసీ కెమెరాల ద్వారా రూ.25 లక్షలు మాత్రమే పోయినట్లు గుర్తించారు. బాధితులు కావాలనే డబ్బులు ఎక్కువగా పోయాయని ఫిర్యాదు చేశారని తెలిపారు. డబ్బులు దోచుకెళ్లిన నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Jan 16, 2023, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.