సీఎం కేసీఆర్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి... కేంద్రానికి పంపాలని బోయ హక్కుల పోరాట సమితి, వాల్మీకి బోయ మేధావుల ఫోరం డిమాండ్ చేసింది.
డాక్టర్ చెల్లప్ప కమిషన్ వేసి రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మీనగ గోపి బోయ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత దయనీయమైన స్థితుల్లో జీవితాలను వెళ్లదీస్తున్న వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
చెల్లప్ప కమిషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలను బీసీలో చేర్చాలన్న అంశాన్ని సైతం అందులో పొందుపరిచి కేంద్రానికి పంపడం ద్వారా అది సాధ్యం కాలేదని అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించని లేనియెడల బోయ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి : ఆరేళ్ల తర్వాత సీఎంకు నిరుద్యోగులు గుర్తొచ్చారా?: బండి సంజయ్