వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జంట నగరాల్లోని వైష్ణవాలయాలను పుష్పాలతో సుందరంగా అలంకరించారు. నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఉత్తర ద్వారం గుండా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేవాలయాల్లో భక్తులు బారులు తీరారు.
హైదరాబాద్ తార్నాకలోని శ్రీ లక్ష్మీగణపతి సాయిబాబా వేంకటేశ్వర స్వామి ఆలయం, శంషాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయలం, నామాలగుండులోని వేంకటేశ్వర స్వామి ఆలయం, కేపీహెచ్ బీ కాలనీలోని వేంకటేశ్వర దేవాలయంలో, వివేకానంద నగర్ లోని శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి, తులసీవనమ్ వేంకటేశ్వర ఆలయాల్లో వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. నామాలగుండులోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్వామి వారికి భక్తులు రకారకాల పండ్లరసాలు, పూలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇదీ చూడండి: శ్రీ వైకుంఠపురంలో.. వైకుంఠ ఏకాదశి సందడి.!