ETV Bharat / state

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌: సీఎం కేసీఆర్‌ - telangana varthalu

vaccination for everyone in the state
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌: సీఎం కేసీఆర్‌
author img

By

Published : Apr 24, 2021, 3:42 PM IST

Updated : Apr 24, 2021, 4:41 PM IST

15:36 April 24

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌: సీఎం కేసీఆర్‌

    రాష్ట్రంలో అందరికీ కొవిడ్ టీకా ఉచితంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర సొంత జనాభాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి పనిచేస్తున్న వారందరికీ వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సుమారు నాలుగు కోట్లలో ఇప్పటి వరకు 35 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారని... మిగతా అందరికీ టీకాలు వేయించనున్నట్లు తెలిపారు. అందరికీ వ్యాక్సినేషన్ కోసం రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్న సీఎం... ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని అన్నారు. 

అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తామన్న ఆయన... ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న వారందరికీ టీకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. భారత్ బయోటెక్ ఇప్పటికే టీకాలు తయారు చేస్తోందని... రెడ్డీ ల్యాబ్స్ సహా మరికొన్ని సంస్థలు కూడా వ్యాక్సిన్ల తయారీకి ముందుకు వచ్చినందున ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరాక సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.  

    వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్న సీఎం కేసీఆర్... పటిష్ఠంగా, విజయవంతంగా అమలు చేసేందుకు జిల్లాల వారీగా ఇన్​ఛార్జులను నియమిస్తామని చెప్పారు. రెమ్డె​సివిర్ తదితర కరోనా సంబంధిత ఔషధాలు, ఆక్సిజన్​కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు అధైర్య పడవద్దని, భయభ్రాంతులకు గురికావద్దని... ఇదే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దని కోరారు. కరోనా సోకినవారికి పడకలు, ఔషధాల విషయంలో ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందని... కొవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. పెద్ద ఎత్తున శానిటైజేషన్ చేస్తామని చెప్పారు. గుంపులు కూడవద్దని, ఊరేగింపుల్లో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని సూచించారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్ఠంగా చేస్తుందన్న సీఎం కేసీఆర్... స్వయం క్రమశిక్షణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి

Last Updated : Apr 24, 2021, 4:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.