ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కరోనా వ్యాక్సినేషన్​.. 24 గంటల్లోనే !

రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1 లక్షా 73 వేల 913 మందికి మొదటి డోసు... 6,171 మందికి రెండో డోసు టీకాలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 88 లక్షల 72 వేల 345 మందికి వ్యాక్సినేషన్ అందించినట్లు పేర్కొంది.

Vaccinated 1,73,913 people in the state
రాష్ట్రవ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్​
author img

By

Published : Jun 19, 2021, 12:41 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1 లక్షా 73 వేల 913 మందికి మొదటి డోసు... 6,171 మందికి రెండో డోసు టీకాలు అందించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు 73 లక్షల 24 వేల 521 మందికి మొదటి డోసు, 15 లక్షల 47 వేల 824 మందికి రెండు డోసుల టీకాలు పూర్తిచేసినట్లు స్పష్టం చేసింది.

ఇప్పటివరకు మొత్తం 88 లక్షల 72 వేల 345 మందికి వ్యాక్సిన్​ అందించినట్లు పేర్కొంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు 79 లక్షల 47 వేల 590 డోసుల టీకాలు అందగా... వాటిలో 62 వేల 970 టీకాలు ఆర్మీకి అందించారు. మరో 78 లక్షల 74 వేల 366 టీకాలు వినియోగించినట్లు తెలిపింది. ప్రస్తుతం కేవలం 0.13 శాతం టీకాలు మాత్రమే వృథా అవుతున్నట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: నేడు కేబినెట్​ అత్యవసర భేటీ.. లాక్​డౌన్​ తొలగింపు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.