రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు. నీ అంతు చూస్తా అంటూ వాద్రా కమాల్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని... పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.
వీహెచ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశామని రాయదుర్గం ఎస్సై సైదులు తెలిపారు.
ఇదీ చూడండి: 'సెటిల్ చేసుకున్నా క్రిమినల్ కేసు రద్దు కాదు'