ప్రధాని పిలుపు మేరకు రేపు జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ పాల్గొనాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరూ బయటకు రాకుండా ఉంటే కొంతమేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూతో కొంత మేర కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు చెప్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా నివారణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వైరస్ తీవ్రత దృష్ట్యా... తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు, ఇతరత్రా ప్రముఖ కంపెనీల ద్వారా సానిటైజర్స్, మాస్కులు తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రేషన్‌కార్డు ఉన్నవారికి ఉచితంగా సరుకులు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు నిత్యావసరాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని, కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్రమత్తంగా ఉండాలని భట్టి విక్రమార్క సూచించారు.
ఇవీ చూడండి: జనతా కర్ఫ్యూ: ఆ 12 ఎంఎంటీఎస్ సర్వీసులు యథాతథం