ETV Bharat / state

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన ఉత్తమ్ - టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి

లాక్​డౌన్ నేపథ్యంలో సొంత గూటికి చేరుకునేందుకు వెళ్తున్న వలస కార్మికులకు అయ్యే ఖర్చు తాము భరించనున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​కు లేఖ రాశారు.

uttam kumar reddy write  letter to somesh kumar
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన ఉత్తమ్
author img

By

Published : May 5, 2020, 9:51 PM IST

లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు రాష్ట్రం నుంచి సొంతూళ్లకు తిరిగి ప్రయాణానికి అయ్యే రైల్వే రవాణా ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు లేఖ రాశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదే అంశంపై చర్చించేందుకు తమకు సమయమిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి టాస్క్​ఫోర్స్​ కమిటీ కన్వీనర్ నిరంజన్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌, ఐటీ సెల్‌ ఛైర్మన్ మదన్ మోహన్‌లను ప్రతినిధులుగా పంపించనున్నట్లు ఉత్తమ్‌ ఆ లేఖలో వివరించారు.

ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.