ETV Bharat / state

'ఆ సిబ్బందికి 50 లక్షల పరిహారం అందించాలి' - టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తాజా సమాచారం

కరోనా వైరస్‌ను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కరోనా విషయంలో సీఎం కేసీఆర్ మొదటి నుంచి అనాలోచితంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. 'స్పీకప్ తెలంగాణ' కార్యక్రమంలో భాగంగా ఆయన ఫేస్​బుక్​ లైవ్​లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు.

uttam said 50 lakh compensation should be given to those corona preventive staff
'ఆ సిబ్బందికి 50 లక్షల పరిహారం అందించాలి'
author img

By

Published : Jul 18, 2020, 5:31 PM IST

Updated : Jul 18, 2020, 7:21 PM IST

'స్పీకప్ తెలంగాణ' కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ ద్వారా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పీకప్ తెలంగాణకు మంచి స్పందన లభించిందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. కరోనా టెస్టులు చాలా తక్కువ చేస్తూ తక్కువ కేసులు చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రం ఏపీలో 15 లక్షలు, దిల్లీలో 16 లక్షలు కరోనా పరీక్షలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్​ టెస్టులు ఎన్నో రెట్లు పెంచాలని అన్నారు.

కరోనా సోకిన పేదలకు ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలని ఉత్తమ్​కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వైరస్ సోకి చనిపోయిన పేదల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.10 లక్షల పరిహారం అందించాలన్నారు. కరోనా నివారణ కోసం ముందుండి పని చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పోలీసులు, జర్నలిస్టులకు ప్రాణహాని జరిగితే రూ.50 లక్షల పరిహారం అందించాలన్నారు.

'ఆ సిబ్బందికి 50 లక్షల నష్ట పరిహారం అందించాలి'

ఇదీ చూడండి : 'స్పీకప్ తెలంగాణ'లో ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నల పరంపర

Last Updated : Jul 18, 2020, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.