ETV Bharat / state

ఎంపీ మృతి పట్ల.. ఉత్తమ్, పొన్నం సంతాపం - ఉత్తమ్ కుమార్, పొన్నం ప్రభాకర్​లు సంతాపం

తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ వసంత కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్​లు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి స్వయాన బాబాయి అయిన వసంతకుమార్ మరణం ఆ కుటుంబానికి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.

Uttam, Poonam mourned the death of the MP vasanthakumar
ఎంపీ మృతి పట్ల.. ఉత్తమ్, పొన్నం సంతాపం
author img

By

Published : Aug 29, 2020, 4:53 AM IST

కాంగ్రెస్ ఎంపీ వసంత కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్​లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని కన్యాకుమారి పార్లమెంట్ సభ్యులు వసంత కుమార్ కరోనా బారిన పడి మృతి చెందారు.

దేశంలో కరోనా రోజు రోజుకూ విజృంభిస్తుందని.. ఒక ఎంపీ కూడా మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వసంత్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో క్రమశిక్షణ కలిగిన నేత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను సంపూర్ణాంగా ఆచరించే నేత అని కొనియాడారు. వసంతకుమార్ కుటుంబం మొత్తం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే క్రియాశీలకంగా పని చేశారని అన్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి స్వయాన బాబాయి అయిన వసంతకుమార్ మరణం ఆ కుటుంబానికి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. వసంతకుమార్ ప్రస్తుతం తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఉన్నారని తెలిపారు. మాజీ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కుమారి ఆనంతన్​కు వసంత కుమార్ స్వయంగా సోదరుడని చెప్పారు. వసంత కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.