ETV Bharat / state

'కరోనా విషయంలో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు'

కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోనే అతి తక్కువగా కరోనా పరీక్షలు చేస్తున్నారని... ఇది సరి కాదంటూ వ్యాఖ్యానించారు.

uttam-kumar-reddy-talking-about-corona-tests-in-telangana
'రాష్ట్రంలో కరోనా పరీక్షలు సరిగా చేయట్లేదు'
author img

By

Published : May 28, 2020, 2:46 PM IST

లాక్​డౌన్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రశ్నించేందుకు... 2 లక్షల మందితో ఆన్‌లైన్ క్యాంపెయినింగ్‌ నిర్వహిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం అతి తక్కువగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుందంటూ ఆరోపించారు.

''క్యాంపెయినింగ్​లో భాగంగా నాలుగు అంశాలను కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మొదటిది ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం పదివేల రూపాయలు ఇవ్వాలి. రెండోది చిన్న వ్యాపారులకు నేరుగా ఆర్థక సాయం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను పట్టించుకోవడంలేదు. వారికి ఆహారం, ఆశ్రయం కల్పించడంలో విఫలమవుతున్నాయి. వారికి సరైనా సదుపాయాలు కల్పించి గమ్యానికి చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ పనిదినాలు 200 రోజులకు పెంచడంతోపాటు... ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి.

రాష్ట్రంలోని కరోనా విషయానికి వస్తే సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు సరిగా చేయట్లేదు. దేశంలో అత్యంత తక్కువ కరోనా పరీక్షలు తెలంగాణలోనే జరిగాయి. హైకోర్టు మొట్టికాయాలు వేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.''

-ఉత్తమ్ కుమార్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.