మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి.. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
గాంధీ భవన్‌లోని సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ఇందిర చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు. ఆమె చేసిన సేవలు, తీసుకొచ్చిన సంస్కరణలను గుర్తు చేసుకున్నారు.
ఇవీచూడండి: నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడిన గాంధీభవన్