ETV Bharat / state

'ఉద్యోగుల విరమణ వయసు పెంపును అందరికీ వర్తింపజేయాలి' - ఉద్యోగ విరమణ వయసు పెంపు అందరికీ వర్తింపజేయాలి - టిఎస్ యుటిఎఫ్

ఉద్యోగుల విరమణ వయసు పెంపుదలను అందరికీ వర్తింపజేయాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి డిమాండ్ చేశారు. ప్రభుత్వం... ఉద్యోగులందరిని సమదృష్టితో చూడాలన్నారు.

utf demanded to employee retirement age should be equal
'ఉద్యోగుల విరమణ వయసు పెంపును అందరికీ వర్తింపజేయాలి'
author img

By

Published : Jun 5, 2020, 11:43 PM IST

ముఖ్యమంత్రి హామీ ప్రకారం ఉద్యోగుల విరమణ వయసు పెంపుదలను అందరికీ వర్తింపజేయాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతామని ముఖ్యమంత్రి వాగ్ధానం చేసి 20 నెలలు గడుస్తున్నా అమలులోకి రాలేదన్నారు. ఇటీవల కాలంలో పది వేలమంది పైగా పదవి విరమణ అయ్యారని.. వారంతా ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురు చూసి నిస్పృహతో పదవీ విరమణ చేశారని పేర్కొన్నారు.

కానీ కొద్దిమంది అస్మదీయులు మాత్రం తమ పలుకుబడిని ఉపయోగించుకొని సర్వీసును రెండేళ్ల పాటు పొడించుకుంటూ వ్యక్తిగతంగా జీవోలు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులందరనీ సమదృష్టితో చూడాల్సిన ప్రభుత్వం ఇలా ఆశ్రిత పక్షపాత ధోరణిని అనుసరించటం సరైంది కాదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా స్వప్రయోజనాల కోసం కాకుండా సభ్యులందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం పాటుపడితేనే వారి నాయకత్వానికి సార్దకత ఉంటుందని హితవు పలికారు.

ఇవీ చూడండి: నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం.!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.