ETV Bharat / state

యూపీఎస్​సీ పరీక్షలు.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు - యుపీఎస్​సీ పరీక్షల అభ్యర్థుల కోసం హైదరాబాద్​లో ప్రత్యేక బస్సులు

ఈనెల 4న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యూపీఎస్​సీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వరకు బస్సులు నడుస్తాయని ఆయన ప్రకటించారు.

UPSC exam Special buses are arranged in hyderabad area
యుపీఎస్​సీ పరీక్షలు.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు
author img

By

Published : Oct 3, 2020, 4:06 PM IST

యూపీఎస్​సీ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఈనెల 4న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ సిటీ బస్సులను నడపనున్నామని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు సిటీ బస్సులు నడుస్తాయన్నారు.

పరీక్షలు రాసే అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వరకు ఆ బస్సులు నడుస్తాయన్నారు. ముఖ్యమైన బస్ స్టాపుల్లో అభ్యర్థులకు అవసరమైన బస్సుల సమాచారం తెలియజేసేందుకు సూపర్ వైజర్లను నియమించామని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చేందుకు తెరాస యత్నం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.