ఇదీ చదవండి:"యుద్ధమా?..మేమూ సిద్ధమే"
నౌహీరా కేసు ఎటు? - CCS
లక్షల మందిని నట్టేట ముంచి... వేల కోట్లు కాజేసి ప్లేటు ఫిరాయించిన హీరా గ్రూప్ సంస్థ కేసు ఏమవనుంది...? కస్టడీలో నౌహీరా షేక్ ఏం చెప్పింది..? కస్టడీలో సీసీఎస్ పోలీసులు సాధించిన ఆధారాలేంటి..?
హీరాకు తెర పడనుందా..?
హీరా గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్ కస్టడీ నేటితో ముగియనుంది. తనపై ఉన్న కేసులకు సంబధించి వీలైనంత సమాచారం రాబట్టేందుకు సీసీఎస్ పోలీసులు యత్నిస్తున్నారు.బయటపడ్డ మోసాలు..పోలీసులు జరిపిన సోదాల్లో లభించిన పత్రాలు, హార్డ్ డిస్క్‌ల ద్వారా పలు మోసాలు బయటపడ్డాయి. సుమారు లక్షన్నర మంది మదుపర్ల నుంచి 6 వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన నౌహీరా షేక్.... వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసింది. నిబంధనలకు విరుద్ధంగా అమెరికా, దుబాయి నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు సీసీఎస్ దర్యాప్తులో తేలింది. ఇప్పటికే పలు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు... నగదు ఎవరి దగ్గర నుంచి వచ్చింది... అది ఏమైంది..? అనే అంశాలపై కూపీ లాగుతున్నారు.రంగంలోకి ఈడీ..హీరా గ్రూప్స్ మోసాలపై విచారణ చేపట్టాల్సిందిగా సీసీఎస్ పోలీసులు లేఖ రాయగా... ఈడీ, ఆదాయపన్ను సంస్థలు కూడా దృష్టి సారిస్తున్నాయి. దర్యాప్తు పూర్తికాకుంటే నౌహీరా కస్టడీని మరింత పొడిగించాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నాంపల్లి న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:"యుద్ధమా?..మేమూ సిద్ధమే"
Tg_srd_02_22_iit_elan_rev_as_r22
రిపోర్టర్: క్రాంతికుమార్, స్టాఫర్
()ఐఐటీ హైదరాబాద్ లో "ఎలాన్" ఉత్సవాలను శుక్రవారం సాయంత్రం ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ యూబి దేశాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఎలాన్ పేరుతో ప్రతీ సంవత్సరం టెక్నో ఉత్సవాలు నిర్వహిస్తారు. 2019 సంవాత్సరానికి గానూ ఎలాన్ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో దేశం లో ని వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారు. విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ లో వస్తున్న మార్పుల పై నిపుణులతో చర్చా కార్యక్రమాలతో పాటుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆదివారం నాడు ముగియనుంది. మొదటి రోజైన శుక్రవారం రోజు రాత్రి ప్రముఖ హిప్ హాప్ కళాకారుడు గల్లిబాయ్ ఫెమ్ 'డివైన్ ' తో మ్యూజికల్ డిజె ఏర్పాటు చేశారు. డివైన్ పాటలకు విద్యార్థులు గొంతు కలుపుతూ, స్టెప్పు లేస్తూ ఉర్రుతలూగారు.....Spot+byte
బైట్: యూబి దేశాయ్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్
Last Updated : Feb 23, 2019, 12:24 PM IST