ETV Bharat / state

'నిత్య జనగణమన'లో యూపీ డిప్యూటీ సీఎం.. వారికి ప్రత్యేక అభినందన - Nitya Janagamana at Nallakunta

హైదరాబాద్‌లోని నల్లకుంటలో నిత్య జనగణమన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి కేశవ్ ​ప్రసాద్​ మౌర్య పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్ఫూర్తిమంతమైన కార్యక్రమం నిర్వహిస్తోన్న లీడర్స్​ ఫర్​ సేవా సంస్థ నిర్వాహకులను ఆయన అభినందించారు.

'నిత్య జనగణమన'లో యూపీ డిప్యూటీ సీఎం.. వారికి ప్రత్యేక అభినందన

author img

By

Published : Jul 2, 2022, 10:23 PM IST

హైదరాబాద్​లోని నల్లకుంటలో లీడర్స్​ ఫర్​ సేవా సంస్థ చేపట్టిన నిత్య జనగణమన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి కేశవ్​ప్రసాద్​ మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. నిత్య జనగణమన కార్యక్రమం ద్వారా జాతీయతా స్ఫూర్తిని విస్తరింపజేస్తున్న సంస్థ నిర్వాహకులు నేలంటి మధు, మల్లాడి క్రాంతి, సర్వు అశోక్, జూకంటి ప్రశాంత్, ఎం.కె. శ్రీనివాస్, నల్ల ప్రవీణ్​లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నిత్య జన గణ మన కార్యక్రమం వినూత్నంగా ఉందన్న ఆయన నిర్వాహకులను కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు.

జమ్మికుంట నుంచి బైక్ ర్యాలీ ద్వారా జాతీయ జెండాను తీసుకొచ్చి.. ఇక్కడ స్థాపించి 50 రోజులుగా ప్రతిరోజు జనగణమన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కేశవ్​ప్రసాద్​ మౌర్యకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కేశవ్​ప్రసాద్​ భావోద్వేగానికి గురయ్యారు. ఈ స్ఫూర్తిమంతమైన కార్యక్రమాన్ని ప్రతిచోట, ప్రతి ఒక్కరు నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కేశవ్​ ప్రసాద్​ మౌర్యతో పాటు భాజపా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు జి.గౌతమ్ రావు, స్థానిక కౌన్సిలర్ వై.అమృత, పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి..

BJP meet in Hyderabad: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ప్రధాని సహా అగ్రనేతలు హాజరు

Corona cases: డేంజర్ బెల్స్.. 516 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.