మేముంటాం అండగా అంటూ వరదలకు భారీగా నష్టపోయిన హఫీజ్‌బాబానగర్‌లో బురదను స్థానిక యువత తొలగిస్తున్నారు. గత ఆరురోజులుగా వీరు ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.
గుమ్మాలకు తోరణాలు లేవు.. ముంగిట్లో రంగవల్లికల్లేవు.. వంటింట్లో పిండి వంటల్లేవు.. ఎటుచూసినా దైన్యమే. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. వీధుల్లోని జలంతో సొంతింట్లో కాలు మోపే వీల్లేక దసరాకు దూరమయ్యారు.
మీర్‌పేటలో ఓ వీధి
కరోనాకు తోడు భారీ వానలు పండుగ సందడి లేకుండా చేశాయి. ఏకంగా 2వేల కాలనీలు, బస్తీల్లో వరద పారుతోంది. సొంతింట్లో పొయ్యి వెలిగించే వీల్లేకుండా పోయింది. మీర్‌పేట పరిధిలో 12 కాలనీలు, సరూర్‌నగర్ చెరువుకు ఎగువన 4, బండ్లగూడ చెరువు పరిధిలో 3 కాలనీలలో అడుగు వేయలేం. వనస్థలిపురంలోని హరిహరపురం, అఖిలాండేశ్వరినగర్, సామనగర్, గాంధీనగర్ సౌత్ కాలనీల్లో వరద పారుతూనే ఉంది. జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ వరదతో ఉమామహేశ్వరకాలనీ, సుభాష్‌నగర్, గంపల బస్తీ నానుతున్నాయి.
నగరంలో ఇదీ పరిస్థితి..
* మొత్తం వరద ప్రభావిత కాలనీలు/బస్తీలు 5వేలు
* బాధితులు 3 నుంచి 4 లక్షల మంది
* ఇంకా వరదనీటిలో నానుతున్నవి 2 వేల కాలనీలు
* ఇళ్లకు దూరంగా ఉన్నవారు లక్ష మంది
* పునరావాస శిబిరాలు 80
* ఆశ్రయం పొందినవారు 20 వేలు
ఇదీ చూడండి: మోండామార్కెట్లో రసాయనిక పేలుడు... త్రుటిలో తప్పిన ప్రమాదం