ETV Bharat / state

మెట్రో సూపర్​ ఆఫర్​- రోజంతా అన్​లిమిటెడ్​ జర్నీ!

Offer on Super Saver Card in Hyderabad Metro: హైదరాబాద్​ వాసులకు గుడ్​న్యూస్​.. మెట్రోలో రోజంతా అపరిమితంగా ప్రయాణించే అవకాశాన్ని హైదరాబాద్​ మెట్రో కల్పించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Offer on Super Saver Card in Hyderabad Metro

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 1:36 PM IST

Updated : Jan 14, 2024, 2:35 PM IST

Offer on Super Saver Card in Hyderabad Metro: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. దీంతో హైదరాబాద్​లో నివసించే చాలా మంది నగర వాసులు తమ స్వస్థలాలకు, బంధువుల ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో పల్లెలన్నీ పండగ శోభను సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే మరికొందరు సంక్రాంతి సెలవులను భాగ్యనగరంలో గడిపేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు వివిధ సంస్థలు, కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ కూడా నగరంలో నివసించే వారితో పాటు హాలీడే ట్రిప్ కోసం వచ్చే వారికి గుడ్ న్యూస్ అందించింది. ఇంతకీ ఏంటి ఆ శుభవార్త అని అనుకుంటున్నారా? అయితే ఆ వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..

Hyderabad Metro Green Line Full Details : హైదరాబాద్​ మెట్రో గ్రీన్​ లైన్​.. ఈ విషయాలు తెలుసా..?

ఒకప్పుడు హైదరాబాద్​లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని కారణంగా ఆఫీసులకు వెళ్లే వాళ్లు, పాఠశాలలకు వెళ్లేవారు ట్రాఫిక్​తో నానా రకాల ఇబ్బందులు పడేవారు. ఎంత తొందరగా ఇంటి నుంచి బయటికి వెళ్లినా.. కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్​లో చిక్కుకోవాల్సి వచ్చేది. అయితే మెట్రో రైళ్లు వచ్చాక ఈ ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. దీంతో ట్రాఫిక్​లో చిక్కుకునే అవసరం లేకపోవడం.. టైమ్​ కూడా సేవ్​ అవ్వడంతో నగరంలో మెట్రో రైళ్లకు ఆదరణ పెరిగింది. దాంతో క్రమక్రమంగా ఈ రైళ్లల్లో కూడా రద్దీ పెరిగింది.

ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అనేక సౌకర్యాలను అందిస్తుంది హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్. అలాగే ప్రత్యేక సందర్భాలు, పండగల సమయంలో మెట్రో ప్రయాణికులకు అధికారులు రాయితీలు, ఇతర ఆఫర్లను అందిస్తున్నారు. గతంలో క్రికెట్ మ్యాచ్‌లు, న్యూ ఇయర్​ సందర్భంగా రైళ్ల వేళలు పెంచి అదనపు రైళ్లను కేటాయించిన మెట్రో సంస్థ... తాజాగా, సంక్రాంతి పండగ సందర్భంగా మరో బంపరాఫర్ ప్రకటించింది. పండగ సందర్భంగా హైదరాబాద్​లో పలు ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ ఆఫర్​ బాగా ఉపయోగపడుతుంది.

15గంటల్లో 268 మెట్రో స్టేషన్లు చుట్టేసిన వ్యక్తి.. రెండేళ్లు ఆలస్యంగా గిన్నిస్ రికార్డు!

అదేంటంటే.. సూపర్​ సేవర్​ కార్డు ద్వారా 59 రూపాయలతో రీఛార్జ్​ చేసుకుని మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నాన్​స్టాప్​గా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఈ కార్డు హాలీడే సమయాల్లో వర్తిస్తుంది. ఈ సంక్రాంతికి ఈరోజు(జనవరి 14), రేపు(జనవరి 15) మెట్రోలో ప్రయాణించే అవకాశం కల్పించారు. కాబట్టి ఆలస్యం చేయకుండా సొంత వాహనాలు, ప్రైవేట్​ వెహికల్స్​ ఉపయోగించేవారు ఈ ఆఫర్​ను యూజ్​ చేసుకోవచ్చు. ఒక్కసారి 59 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఆ రోజంతా మెట్రోలో ప్రయాణించవచ్చు. అయితే ఈ కార్డు అంతకుముందు నుంచే అందుబాటులో ఉంది. మొదట్లో దీని ధర 59 రూపాయలు ఉండగా.. కొన్ని నెలల తర్వాత 99 రూపాయలు చేశారు. ఇప్పుడు మళ్లీ పాత ధరకే అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో మెట్రో ప్రయాణికులు కొనుగోలు చేసిన హాలిడేస్ కార్డుతో ఈ సౌకర్యాలు పొందవచ్చు.

ఈ కార్డు ఎలా పొందాలి : ఇప్పటికే కార్డు ఉన్న వారు.. 59 రూపాయలతో రీఛార్జ్​ చేసుకుంటే సరిపోతుంది. హాలీ డే సూపర్ సేవర్ కార్డులేని వారు రూ.50 చెల్లించి కొత్త కార్డును కొనుగోలు చేయాలి. ఆ తర్వాత 59 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. మెట్రో స్టేషన్లలో కౌంటర్ల వద్ద ఈ కార్డు లభిస్తుంది. 2024, మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

వందే భారత్​ 2.0!.. త్వరలోనే స్లీపర్, మెట్రో​ రైళ్లు.. వీటి స్పెషలేంటో తెలుసా?

Last Updated : Jan 14, 2024, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.