ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు, కేంద్రంలో భాజపా ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర కార్మికశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సనత్ నగర్లోని ఈఎస్‌ఐ వైద్యశాలలో...కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎర్రగడ్డలోని ఛాతి హాస్పిటల్లో రోగులకు పండ్లు పంచారు. ప్రహ్లాద్ జోషితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో విష జ్వరాలు, వాతావరణ కాలుష్యం ఎక్కువైందని, వెంటనే వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకొని భాజపా నాయకులు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం'