ETV Bharat / state

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ - Hyderabad Latest News

Rajnath Singh visits Prabhas house: కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. రోడ్డుమార్గం ద్వారా కృష్ణంరాజు ఇంటికి చేరుకున్న ఆయన.. ప్రభాస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కృష్ణంరాజు
కృష్ణంరాజు
author img

By

Published : Sep 16, 2022, 4:01 PM IST

Updated : Sep 16, 2022, 4:47 PM IST

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

Rajnath Singh visits Prabhas house: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్​సింగ్‌ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గం ద్వారా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న ఆయన.. ప్రభాస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్​నాథ్​సింగ్​ వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ ఉన్నారు. కృష్ణంరాజు అనారోగ్యానికి కారణం ఏంటి? ఏయే చికిత్సలు అందించారో ఎంపీ లక్ష్మణ్‌ రాజ్‌నాథ్‌కు వివరించారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు నేతలు ధైర్యం చెప్పారు.

అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌కు.. రాష్ట్ర భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాజ్​నాథ్​సింగ్​ నేరుగా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి జేఆర్​సీ కన్వెన్షన్​లో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి నగరానికి వస్తున్న అమిత్​షా.. రేపు ప్రభాస్​ను పరామర్శించనున్నారు.

ఇవీ చదవండి : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు.. పాల్గొన్న మంత్రులు

రాహుల్ పాదయాత్రకు విరాళాల కోసం దారుణం.. కూరగాయల వ్యాపారిపై దాడి

Last Updated : Sep 16, 2022, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.