రాష్ట్రంలో వ్యవసాయ వ్యవసాయ రంగం, రైతు సంక్షేమంపై సమీక్ష కేంద్రమంత్రి శోభా కరంద్లాజే సమీక్షించారు. బీఆర్కే భవన్‌లో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే... వ్యవసాయ రంగం, రైతు సంక్షేమంపై సమావేశమయ్యారు. సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.
సాగు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, రైతు సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల గురించి అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.
ఇప్పుడు చెబితే ఎలా..?
సమీక్షలో.. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. బియ్యం తీసుకోలేమని మధ్యలో చెబితే రైతులకు ఇబ్బందులు పడతారని... 2 సీజన్ల బియ్యం తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఇదీ చూడండి: CM KCR On Rice crop: యాసంగిలో వరిసాగు వద్దని తేల్చిచెప్పిన సీఎం.. ఎందుకంటే..